ఈతరం భారతం వరంగల్ జనవరి 26
మేడారం దారులు అప్పుడే కిక్కిరిసిపోతున్నాయి. భక్తులకు ఏ చిన్న అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని సర్కార్ పేర్కొన్నదంతా ఉత్తదేనని ట్రాఫిక్ ఆచరణ చూస్తే తెలుస్తుందనే భక్తులు ఉదహరిస్తున్నారు. జాతర ఇంకా ప్రారంభమే కాలేదు. ఆర్టీసీ నడిపే 4వేల బస్సులు, అంతకు పదింతలు ప్రైవేట్ వాహనాలు మేడారం బాట పట్టేందుకు సిద్ధం అవుతున్నాయి. వరంగల్ ములుగు రోడ్ నుంచి ములుగు దాకా, ములుగు నుంచి తాడ్వాయి వయా పస్రా దాకా ఇప్పుడే ట్రాఫిక్ జామ్ అవుతున్నది. మరోవైపు సంక్రాంతి సంబురాలకు టోల్ ఎత్తేసిన రేవంత్ సర్కార్ మేడారం జాతరకు వెళ్లే భక్తులకూ ఎత్తివేయాలనే డిమాండ్ వ్యక్తం అవుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా టోల్‌ప్లాజాల విషయం ఏమోకానీ కనీసం ములుగు జిల్లా జవహర్‌నగర్‌ని టోల్‌ప్లాజాలో జాతర వరకు టోల్ ఎత్తివేయాలని భక్తులు కోరుతున్నారు. టోల్‌ప్లాజా వద్ద వాహనాలు నిలిచిపోవటం ట్రాఫిక్ జామ్‌కు కారణం అవుతున్నది
.















