EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

నోటిని అదుపులో పెట్టుకోవాలి పార్టీ నేతలకు కొండా సురేఖ హెచ్చరిక

ఈతరం భారతం వరంగల్ సెప్టెంబర్ 29:

________________________________

వర్గ విభేదాలను పక్కన పెట్టి పార్టీ కోసం పని చేయాలని, కొంతమంది నేతలు నోరు హద్దులో పెట్టుకోవాలని కొండా సురేఖ హితవు పలికారు. కొంతమంది నాయకులు హద్దు మీరి మాట్లాడుతున్నారని, నోరు అదుపుతప్పి మాట్లాడితే మహిళలతో చిత్తుచిత్తుగా కొట్టిస్తానని హెచ్చరించారు. ఒక్కో మహిళ నలుగురిని కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇప్పటికైనా కొండా దంపతులను విమర్శించాలంటే నోటిని అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. కొండ అభిమానులను, కాంగ్రెస్ కార్యకర్తలను విమర్శించే వారు ఇకపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రతిపక్ష నేతలు నాయకులు గాలిలో కత్తులు తిప్పుతున్నారని మండిపడ్డారు. వారిని ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని సూచించారు.

Related News

Select the Topic
Scroll to Top