EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఆలేరులో సద్దుల బతుకమ్మ వేడుకలు 

ఆలేరులో సద్దుల బతుకమ్మ వేడుకలు 

ఈతరం భారతం యాదాద్రి భువనగిరి అక్టోబర్ 18 :

జిల్లా పరిధిలోని ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో, మండలంలోని వివిధ గ్రామాలలో ఆదివారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఎంతో ఘనంగా జరిగింది. ప్రకృతి పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను తీసుకువెళ్లి ఆలయ ప్రాంగణాలు, వీధులు, ఇండ్ల ముందు పెట్టి ఉయ్యాల పాటలతో ఆటలు ఆడారు. సద్దుల బతుకమ్మ తో గ్రామాలు, పట్టణాలలో పండుగ వాతావరణం నెలకొంది. ఆలేరు పెద్ద వాగులో బతుకమ్మలను అందమైన ప్రకృతి పూలతో ఆకర్షణీయంగా పేర్చిన పుట్ట రేణుకకు అందరి ప్రశంసలతో పాటు బహుమతి లభించింది. బతుకమ్మ ఉత్సవానికి హాజరైన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య రేణుక రూపొందించిన ప్రకృతి పూల పెద్ద బతుకమ్మను చూసి బహుమతి పొందినందుకు అభినందనలు తెలిపారు. కొలనుపాక, గుండ్ల గూడెం, శారాజీపేట, శ్రీనివాసపురం, పటేల్ గూడెం, కొల్లూరు, తూర్పు గూడెం తో సహా పలుచోట్ల అందమైన మహిళల బతుకమ్మలను ఎంపిక చేసి నిర్వాహకులు బహుమతులను అందజేశారు. ఆలేరు పట్టణంలోని వివిధ వార్డులలో మహిళలు బతుకమ్మ ఆడుతున్న ప్రాంతాలకు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఆయన సతీమణి అనిత స్వయంగా వెళ్లి వారికి శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.

Related News

Select the Topic
Scroll to Top