EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఎలక్ట్రానిక్ మీడియా సీనియర్ జర్నలిస్ట్ రవికుమార్ కు  బొమ్మల పల్లకి పురస్కారం

ఈతరం భారతం యాదాద్రి భువనగిరి జిల్లా: సెప్టెంబర్ 27

________________________________________________________________

జిల్లా పరిధిలోని ఆలేరు కు చెందిన సీనియర్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ ముల్లక్కల్ రవికుమార్ కు కొత్త తెలంగాణ చరిత్ర బృందం మా ఊరి జాతరలు ఉన్న అంశంపై నిర్వహించిన వీడియో డాక్యుమెంటరీ పోటీలలో ప్రత్యేక ప్రతిభా పురస్కారం లభించింది. రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది పాల్గొన్న ఈ పోటీలో రవికుమార్ రూపొందించి చిత్రీకరించిన డాక్యుమెంటరీని జ్యూరీ ప్రత్యేక ప్రతిభా పురస్కారానికి ఎంపిక చేసింది. కొత్త తెలంగాణ చరిత్ర బృందం బాధ్యులు, ప్రముఖ చరిత్ర పరిశోధకులు శ్రీ రామోజు హరగోపాల్ రవికి నగదు పురస్కారాన్ని, ప్రశంసా పత్రం,జ్ఞాపికను ఆదివారం అందజేసి అభినందించారు. పురస్కారం అందుకున్న రవికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

Related News

Select the Topic
Scroll to Top