ఈతరం భారతం యాదాద్రి భువనగిరి జిల్లా:
__________________________________
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాలలో భాగంగా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రాంగణంలోని విగ్రహానికి పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమం లో పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు పాశికంటి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నో త్యాగాలు చేసి ఉన్నతమైన వ్యక్తిత్వంతో నిలబడిన ఆదర్శవాది కొండా లక్ష్మణ్ బాపూజీ అని చెప్పారు. సంఘం ప్రధాన కార్యదర్శి చిక్క శ్రవణ్ కుమార్, బింగి రవి ,బడుగు జహంగీర్ చిట్టిమిళ్ల వెంకటేష్, బేతి శ్రీనివాస్, గుజ్జ అశోక్, బేతి వెంకటేష్ , బేతి బాలరాజు, గట్టు రాజు, కటకం మల్లేష్ ,మెరుగు శ్రీధర్, అమృతం నర్సింహులు, కర్ణాల నర్సింగరావు, కొండయ్య ,బండ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.















