EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

జానపద నృత్య పోటీలో  జాతీయ బహుమతి  అందుకున్న బేబీ రియా

ఈతరం భారతం యాదాద్రి భువనగిరి అక్టోబర్ 5:

_____________________________________

జిల్లా పరిధిలోని ఆలేరు నియోజకవర్గ కేంద్రానికి చెందిన ఐదవ తరగతి విద్యార్థిని గాండ్ల రియా ( అక్కి ) న్యూఢిల్లీలో జరిగిన మెగా ఇంటర్ స్కూల్ పోటీలలో భారతీయ జానపద సాంస్కృతిక గీతం పై నృత్య ప్రదర్శన చేసి బహుమతిని గెలుచుకుంది.జాతీయస్థాయిలో జరిగిన పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బహుమతిని కైవసం చేసుకున్న రియాను తాత గాండ్ల చంద్రయ్య, నానమ్మ విజయ, తల్లిదండ్రులు శ్రీధర్, రేవతి, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్థానికులు, ఉపాధ్యాయులు సోమవారం అభినందించారు. అతి చిన్న వయసులోనే జాతీయ స్థాయిలో నృత్య రంగంలో గుర్తింపు పొందిన రియా భవిష్యత్తులో ఇంకా మంచి పేరు ప్రఖ్యాతులను సాధించాలని వారు ఆకాంక్షించారు.

Related News

Select the Topic
Scroll to Top