ఈ తరం భారతం యాదాద్రి భువనగిరి: అక్టోబర్ 21
_______________________________________
జిల్లా పరిధిలోని ఆలేరు మండలం కొలనుపాక బస్టాండ్ వద్ద దుర్గామాత యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక నృత్య ఉత్సవంలో బాల నృత్య కళాకారులు ఏలూరి సాన్విక, ఏలూరి లాస్విక అద్భుతమైన నృత్య ప్రదర్శన ఇచ్చారు.
సాంస్కృతిక ఉత్సవానికి హాజరైన వారంతా ఈ శాస్త్రీయ సంప్రదాయ రీతిలో దుర్గా వైభవ నృత్యాన్ని ప్రదర్శించి అలరించిన ఈ ఇద్దరు చిన్నారులను అభినందించారు. దుర్గామాత యూత్ అసోసియేషన్ తరపున నిర్వాహకులు ఈ చిన్నారులను, మరొక చిన్నారిని కూడా వేదిక పైన ఘనంగా సన్మానించారు.















