ఈతరం భారతం యాదాద్రి భువనగిరి జిల్లా: సెప్టెంబర్ 28
ఆలేరు నియోజకవర్గ కేంద్రంలోని మంతపురి రోడ్డు క్రాంతి నగర్ లో గణేష్ యూత్ అసోసియేషన్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి భారీ గణేష విగ్రహాన్ని శోభాయాత్ర నిర్వహించి నిమజ్జనోత్సవానికి తరలించారు. అంతకు ముందు లడ్డు వేలం పాటను నిర్వహించగా 2 లక్షల 20 వేల భారీ మొత్తానికి దండుగుల శ్రావణ్ సంధ్య లడ్డూను దక్కించుకున్నారు. మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, అన్ని పార్టీల ముఖ్య నేతలు, స్థానిక ప్రముఖులు , ప్రజలు శోభాయాత్రలో పాల్గొన్నారు.















