ఈతరం భారతం హైదరాబాద్ ప్రతినిధి ఎప్రిల్ 1 2024 : జై స్వరాజ్ పార్టీ మహిళా అధ్యక్షురాలుగా రశ్మితను ఈరోజు జై స్వరాజ్ పార్టీ అధ్యక్షులు కాసాని శ్రీనివాసరావు గౌడ్ నియమించారు. భువనగిరి యాదాద్రి జిల్లాకు చెందిన మానవ హక్కుల ఉద్యమ కారిణి రశ్మిత మహిళా హక్కులపై వివిధ రకాలుగా పోరాటం చేస్తున్నారు. వారి సేవలను గుర్తించి పార్టీ వారిని ఆహ్వానించింది . జై స్వరాజ్ పార్టీ సిద్ధాంతాలు నచ్చిన రశ్మిత జై స్వరాజ్ పార్టీ తెలంగాణ మహిళా అధ్యక్షురాలుగా ఈరోజు బాధ్యతలు తీసుకున్నారు . ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుమ్బాల పరశురాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.















