ఈతరం భారతం యాదాద్రి భువనగిరి ప్రతినిధి ఏప్రిల్ 1,2024 :ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆలేరు ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ అధికారిణి డా. కదిరి హరిత నేతృత్వంలో యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్ట మండలం పెద్ద కందుకూరు గ్రామములో వారం రోజుల ప్రత్యేక శిబిరం సోమవారం ముగిసింది. ముగింపు సమావేశానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి లక్ష్మణ్ నాయక్ అధ్యక్షత వహించారు. వారం రోజుల సేవా కార్యక్రమాలు తమలో ఒక మధురానుభూతిని మిగిల్చాయని వాలంటీర్స్ ఉష, అనమ్మా, కిరణ్, నవీన్ తదితరులు అభిప్రాయాలను ను వెలిబుచ్చారు. ఒక చిన్న వూరిలో ఉంటూ ఇలా వివిధ సేవా కార్యక్రమాలు చేయడం మనసుకు ఎంతో సంతృప్తినిచ్చిందని, వచ్చే ఏడాది క్యాంప్ లో మరిన్ని సేవా కార్యక్రమాలలో పాల్గొంటామని డాక్టర్ హరిత తెలిపారు. వెంకటేశం, ముత్యాలు, ఉదయ భాస్కర్, శ్రీనివాస్, సైదులు, రేవంత్, జాని పాల్గొన్నారు.















