EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఒకే వేదిక మీదకు విశ్వబ్రాహ్మణ సేవా సంస్థలు విశ్వబ్రాహ్మణ సేవా సంస్థల ఐక్యతా నినాదం

హైదరాబాద్ ఏప్రిల్ 1 (ఈతరం భారతం న్యూ స్);ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్న విశ్వబ్రాహ్మణ సేవా సంస్థలను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి, వారిని ఐక్యపరిచే లక్ష్యంతో, హైదరాబాద్ హనుమాన్ టెక్డి బిసి హాల్లో “విశ్వబ్రాహ్మణుల కీలక సమస్యల” పై జరిగిన ‘రౌండ్ టేబుల్ సమావేశం’ విజయవంతంగా ముగిసింది.కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశ్రాంత జస్టిస్ బి చంద్రకుమార్ హైకోర్టు జడ్జి (అవిభాజ్య ఆంధ్రప్రదేశ్) మరియు సభాధ్యక్షులుగా బెంగళూరు నుంచి విచ్చేసిన డాక్టర్ కశ్యప్ దాకోజు వ్యవహరించారు.అమెరికా నుండి విచ్చేసిన వినోద్ కుకునూరు (వ్యవస్థాపకులు కవిన్ ఫ్రెండ్లీ ఫౌండేషన్ యూఎస్ఏ మరియు కమిటీ సభ్యులు గ్లోబల్ విశ్వకర్మ ఎన్ఆర్ఐ ఫౌండేషన్, మరియు వరప్రసాద్ గురజాపు గారు (విశ్వకర్మ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా కమిటీ సభ్యులు) ఈ సమావేశం లో విశిష్ట అతిథులు గా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా విశ్వకర్మ ఫౌండేషన్ అండ్ సేవా ట్రస్ట్ విద్యానిధి కి వినోద్ కుకునూరు లక్ష రూపాయల చెక్ విరాళంగా అందజేశారు. ప్రకాశం జిల్లా మార్టూరులో నిర్మిస్తున్న అమ్మ ఆశ్రమానికి విరాళంగా గౌరవ దాతల సహకారం తో వెస్సో ట్రస్ట్ తరఫున అధ్యక్షుడు బంగారు తాతారావు 30,366 రూపాయల చెక్ అందజేశారు. ఈ సందర్భంగా కార్యక్రమం నిర్వహించిన వెస్సో ట్రస్ట్ అధ్యక్షులు బంగారు తాతారావు విశ్వకర్మ ఫౌండేషన్ అధ్యక్షులు చింతాడ నరేంద్ర కుమార్, విశ్వంలో విలీనం సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు పెంటా శ్రీనివాస చారి మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి విచ్చేసిన విశ్వబ్రాహ్మణ సేవా సంస్థల ప్రతినిధులకు, వారి సలహాదారులకు, గౌరవ దాతలకు, “సృజన కారులు” పక్షపత్రిక ఎడిటర్ కొత్తపల్లి సీతారామ్ ఆచార్య, నిర్వాహకులు నక్కా సుధాకర్, పాల్గొన్న గౌరవ అతిథులు అందరకూ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top