EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

తాగునీటి సరఫరాను పర్యవేక్షణకు పదిమంది ఐఏఎస్ అధికారుల నియామకం    తాగునీటికి కొరతరాకుండా చూడాలని ఆదేశించిన ప్రభుత్వం

హైదరాబాద్ ఏప్రిల్ 3 (ఈతరం భారతం న్యూ స్);తాగునీటి సరఫరాను పర్యవేక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం పదిమంది ఐఏఎస్ అధికారులను నియమించింది. నీటి సరఫరాను పర్యవేక్షించే ఈ అధికారులు జులై చివరి వరకూ సెలవు పెట్టకూడదని ప్రభుత్వం షరతు విధించింది. నీటి వృథాను అరకట్టి, గరిష్ఠ స్థాయిలో ప్రజలకు తాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.వర్షాకాలంలో ఆశించినమేరకు వానలు పడకపోవడం, ఎండల తీవ్రత అధికం కావడంతో జలాశయాల్లో నీటిమట్టాలు అడుగంటిపోతున్నాయి. భూగర్భ జలమట్టం కూడా అంతకంతకూ పడిపోయింది. ఈ నేపథ్యంలో తాగునీటికి కొరతరాకుండా చూడాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

 

 

–

 

 

 

Related News

Select the Topic
Scroll to Top