EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

.సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం:ఏడుగురు మృతి

సంగారెడ్డి ఏప్రిల్ 3 (ఈతరం భారతం న్యూ స్);: సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. హత్నూర మండలం చందాపూర్‌ వద్ద ఉన్న ఎస్బీ ఆర్గానిక్స్‌ పరిశ్రమలో ఈరోజు( బుధవారం) రియాక్టర్‌ పేలి మంటలు భారీగా వ్యాపించాయి. ఈ అగ్ని ప్రమాదంలో పరిశ్రమ డైరెక్టర్‌ రవితో పాటు మరో ఆరుగురు కార్మికులు మృతి చెందారు.ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫ్యాక్టరీలో పొగలు దట్టంగా అలుముకున్నాయి. ఫ్యాక్టరీలో ఉన్న కార్మికులను బయటకు తీసుకురావడానికి సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని వారిని అక్కడ నుంచి పంపించి వేస్తున్నారు. పోలీసులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 

Related News

Select the Topic
Scroll to Top