హైదరాబాద్ ఏప్రిల్ 4 (ఈతరం భారతం న్యూ స్);: హైదరాబాద్ జిల్లాలో వివిధ ఎన్ఫోర్స్మెంట్ బృందాల ద్వారా గడిచిన 24 గంటల్లో రూ. 27,12,390/- నగదు, 8,23,500/- రూపాయల విలువ గల ఇతర విలువైన వస్తువులను,155.90 లీటర్ల లిక్కర్ ను సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ తెలిపారు. నగదు, ఇతర వస్తువుల పై 12 పిర్యాదులు రాగా వాటిని పరిశీలించి పరిష్కరించినట్లు, 6 ఎఫ్ఐఆర్ లు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. 55 లైసెన్స్ గల ఆయుధాలను డిపాజిట్ చేసినట్లు వివరించారు.జిల్లాలో ఇప్పటి వరకు 5 కోట్ల 31 లక్షల 61 వేల 970/- రూపాయల నగదు, ఒక కోటి 72 లక్షల 46 వేల 788/- రూపాయల విలువ గల ఇతర వస్తువులు పట్టుకుని సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. 19,179.81 లీటర్ల మద్యం పట్టుకుని 133 కేసులు నమోదు చేసి 132 మందిని అరెస్ట్ చేశామని, 2324 లైసెన్స్ గల ఆయుధాలను డిపాజిట్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి వివరించారు.ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుండి ఇప్పటి వరకు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల ద్వారా 2,72,81,100/- రూపాయలు, పోలీస్ శాఖ ద్వారా రూ. 2,43,01,180/- లు, ఎస్ ఎస్ టీ బృందాల ద్వారా 15 లక్షల 79 వేల 690 రూపాయల నగదు సీజ్ చేయడం జరిగిందని తెలిపారు.















