EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

అత్యవసర సర్వీస్ శాఖల ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలి   హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి

హైదరాబాద్, ఏప్రిల్ 04(ఈతరం భారతం న్యూ స్); : భారత ఎన్నికల సంఘం గుర్తించిన అత్యవసర సర్వీస్ శాఖల సంబందించిన ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకొనుటకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా అప్లై చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి అనుదీప్ దురుశెట్టి అన్నారు. అత్యవసర సర్వీస్ శాఖ నోడల్ అధికారులతో పోస్టల్ బ్యాలెట్ పై జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం పన్వర్ హాల్ లో సమావేశం ఏర్పాటు చేసారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… అత్యవసర సర్వీస్ శాఖలకు సంబంధించిన శాఖకు పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి ఒక నోడల్ అధికారి నియమించుకుని అట్టి వివరాలను అందజేయాలని కోరారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకొనువారు ఫారం-12 డి పూర్తిగా నింపి దానితో పాటు ఓటరు గుర్తింపు కార్డు జత చేస్తూ సంబంధిత హెడ్ ఆఫీసర్ అటెస్టెడ్ చేసి రిటర్నింగ్ అధికారి వద్ద ఈ ఏప్రిల్ 15 తేదీలోగా అందజేయాలని కోరారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హత ఉన్న వారికే ఓటు వేసే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు.ఎపిక్ కార్డు ఉంటే సరిపోదు, ఓటర్ జాబితాలో పెరుందో లేదో పరిశీలన చేసుకోవాలని ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా మీ ఎపిక్ నంబర్ తో పరిశీలన చేసుకోవచ్చునని అన్నారు. ఒక సారి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయుటకు నిర్ణయించిన పిదప పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేస్తానని అనుకుంటే కుదరదు ఓటరు జాబితాలో మార్కు వేసినందున పిఓ ఓటు వేయడానికి అవకాశం ఇవ్వరని అన్నారు. ఓటు ఏ నియోజకవర్గంలో ఉందో అక్కడ పోలింగ్ రోజున వేయుటకు ప్రభుత్వ ఉద్యోగి ప్రత్యేక సిఎల్ అనుమతి ఇస్తూ కేంద్ర ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించినట్లు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు ఇదివరకే ఎన్నికల విధులు నిర్వహించిన వారికి ఫారం-12 D ఇవ్వ వలసిన అవసరం లేదన్నారు. ఇప్పటికే ట్రైనింగ్ తరగతుల సందర్భంగా పోస్టల్ బ్యాలెట్ వినియోగించు కొనుటకు ఫారం -12 అందజేయడం జరిగిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసం తో పాటుగా కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికలకు కోసంకూడ పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవచ్చుననని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ అందజేసిన వారికి ఓటు హక్కు వినియోగించుకొనుటకు మే3 నుండి 8 వరకు ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద ఓటు వేసేందుకు అవకాశం ఉందని. నిర్ణయించిన తేదీలలో కాకుండా 8 తర్వాత పోస్టల్ బ్యాలెట్ వేస్తానని రిటర్నింగ్ అధికారికి వద్దకు వస్తే సంబంధిత హెడ్ బాధ్యుడుని చేసి సంబంధిత అధికారి చర్యలకు వెనుకాడమన్నారు.హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో అత్యవసర సేవల ఉద్యగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top