EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

దేవాలయ భూముల పరిరక్షణకు ప్రాధాన్యత ఎండోమెంట్ కమీషనర్ హనుమంత రావు

హైదరాబాద్, ఏప్రిల్ 4 (ఈతరం భారతం న్యూ స్);: రాష్ట్రంలోని దేవాదాయ భూముల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత నివ్వాలని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమీషనర్ ఎం. హనుమంత రావు అన్నారు. దేవాదాయ శాఖ కమీషనర్ కార్యాలయంలో శాఖకు చెందిన ఉన్నతాధికారులు, అన్ని ప్రధాన దేవాలయాల కార్యనిర్వహణాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమీషనర్ హనుమంత రావు మాట్లాడుతూ, రాష్ట్రంలోని వివిధ దేవాలయాలకున్న మాన్యాలు, భూములను పరిరక్షించాలని, రెవెన్యూ శాఖతో కలసి వాటికి హద్దులు ఏర్పాటు చేయాలని అన్నారు. ఆక్రమణలకు గురైన భూములను రెవెన్యూ శాఖ అధికారుల సహాయంతో స్వాధీన పరుచుకోవాలని సూచించారు. న్యాయస్థానాల్లో ఉన్న దేవాలయ భూములకు సంబంధించి తగు కౌంటర్లు దాఖలు చేయాలన్నారు. ప్రస్తుత వేసవిలో వచ్చే సెలవుల్లో పెద్ద ఎత్తున భక్తులు దేవాలయాలను సందర్శిస్తారని, వారికి నీడను ఏర్పాటు చేయడం, చల్లటి పానీయాలు, చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రధానంగా సామాన్య భక్తులకు అత్యంత ప్రాధాన్యత నివ్వాలని, భక్తులు తిరిగి మళ్ళీ వచ్చే విధంగా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రసాదాలలో తగు నాణ్యత పాటించాలన్నారు. దేవాలయాలకు సంబంధించిన ఆదాయ, వ్యయాలకు సంబంధించి లెక్కలు పకడ్బందీగా నిర్వహించాలని, ఏ విధమైన అవకతవకలు జరిగితే సహించేది లేదని స్పష్టం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అన్నారు. దేవాలయ అర్చకులు, పూజారులు, క్రింది స్థాయి సిబ్బంది సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతీ వారం తమ కార్యాలయ అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశాలను ఏర్పాటు చేసుకోవాలని హనుమంత రావు పేర్కొన్నారు. ప్రతీ ఆలయంలో ఆ ఆలయం చరిత్ర, ప్రశస్తిని తెలిపే సమాచారంతో కూడిన బోర్డులను ప్రదర్శించాలని తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ కమీషనర్లు జ్యోతి, కృష్ణవేణి, డిప్యూటీ కమీషనర్లు, సహాయ కమీషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

 

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top