EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

మెజారిటీ ఓటర్లు ఉన్న బీసీలను విస్మరించడం సామాజిక న్యాయస్ఫూర్తికి విరుద్ధం బీసీ సేన రాష్ట్ర అధ్యక్షులు బూరుగుపల్లి కృష్ణ యాదవ్

మహబూబ్ నగర్ ఏప్రిల్ 4 (ఈతరం భారతం న్యూస్);మహబూబ్ నగర్ పార్లమెంటునియోజకవర్గం లో మెజారిటీ ఓటర్లు ఉన్న బీసీలను విస్మరించి సామాజిక న్యాయస్ఫూర్తికి విరుద్ధంగా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు మహబూబ్ న గర్ పార్లమెంటు సీటు కేటాయించడాన్ని బీసీ సేన రాష్ట్ర అధ్యక్షులు బూరుగుపల్లి కృష్ణ యాదవ్ తీవ్ర స్థాయి లో విమర్శించారు. జడ్చర్ల మండల కేంద్రంలో నేడు బిసి సేన కార్యాలయంలో బీసీ సేన ముఖ్య నాయకుల సమావేశంలో కృష్ణ యాదవ్ మాట్లాడుతూ మరో మారు రాజకీయ పార్టీలు బీసీ వ్యతిరేకతమ చాటుకున్నా యని ఆయా పార్టీల తీరుపై మండిపడ్డారు. ఎన్నికల సమయంలో బీసీ జపం చేసిన ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చాక తమ సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకే నామినేటెడ్ పోస్టులు, పార్లమెంటు సీట్లు కేటాయిస్తూ కేవలం బీసీలకు మూడుసీట్లుకేటాయించి రాజకీయంగా అణచి వేశారని, వచ్చే పార్లమెంటు ఎన్నికలలో, కాంగ్రెస్ పార్టీతో పాటు, బీసీ వ్యతిరేక పార్టీల అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని బీసీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీసేన మండలప్రధాన కార్యదర్శి గొడుగు నర్సిములు, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి లింగంపేట శేఖర్,కార్మిక విభాగం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సురభి విజయ్ కుమార్, జిల్లా నాయకులు కుర్వ గడ్డ పల్లి గోపాల్, నియోజకవర్గ కార్యదర్శి రామస్వామి, మండల కార్యనిర్వాహక అధ్యక్షులు గోపాల్,వెంకటేష్, శివ శంకర్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top