హైదరాబాద్ ఏప్రిల్ 4 (ఈతరం భారతం న్యూస్ )కొర్పోలి ఎన్కౌంటర్ భూటకం ఎన్కౌంటర్ అని సిపిఐ( ఏం ఎల్) చండ్ర పుల్లారెడ్డి పార్టీ కేంద్ర కమిటీ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించింది.ఛత్తీస్గఢ్ రాష్ట్రo బీజాపూర్ జిల్లా కొర్పోలి అటవీ ప్రాంతంలో 13 మంది ఆదివాసీ యువకులను పట్టుకొని చిత్ర హింసలకు గురిచేసి చట్లకు కట్టేసి కాల్చి చంపి ఎన్కౌంటర్ అంటూ బూటకపు మాటలు మాట్లాడుతున్న బస్టర్ ఐజీ సుందర్ రాజు ప్రకటించడం అవు పులి కత లాగే ఉంది దండకారణ్యంలో అమాయక ఆదివాసీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి అభివృధి కోసం నాయ పైసా కూడా కర్చు పెట్టలేదు,వారిని కనీసం మనుషులుగా కూడా గుర్తించలేదు ఈ దోపిడి,దళారీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారిని చంపెహక్కు ఎవరిచ్చారు అని సిపిఐ ( యం ఎల్) చండ్ర పుల్లారెడ్డి పార్టీ కేంద్ర కమిటీ డిమాండ్ చేసింది.దండకారణ్యం లో ఉన్న అపారమైన కనిజ,నిది నిక్షేపాలు రంగు రాలు,మైనింగ్ అదాని అంబానీ,విదేశీ కార్పొరేట్ మల్టినేషన్ కంపెనీల అడువులను దారాదత్తం చేసేందుకే నరేంద్రమోడీ ప్రభుత్వం చూస్తున్నది అమాయక ఆదివాసీలను అడువుల నుండి తరిమివేసే కుట్రలో భాగమే ఆదివాసీలను నక్సలైట్ పేర్ల మీద కాల్చి చంపుతూ ఎన్కౌంటర్ కతలు అల్లుతున్నారని ఆరోపించింది.సొంత ప్రజలపైనే ఉద్దం ప్రకటించిన మోడీ ఈ అపరెషన్ లో డ్రోన్ లతో బాంబులు వేయడం ,డీ అర్ జి,ఎస్టీ ఎఫ్,కోబ్రా,బస్టర్ పైటర్స్ , సి ఆర్ పి ఎఫ్, లాంటి సాయుధ బలగాలు అడువు లో క్యంపులు వేసుకొని ఆదివాసీలను తమ క్యంపు లో కాందిశీకులు మార్చి వేసినారుపోయిన నెలలో 6 మంది ఆదివాసీ యు వకులను కాల్చి చంపి ఎన్కౌంటర్ అని పొట్టన పెట్టుకున్నారని పేర్కొంది.అయినా ఆదివాసీలు సాయుధ బలగాలను ఎదురొడ్డి పోరాడుతున్నారని తెలిపింది.అడువు లో అక్రమ మైనింగ్ వెంటనే నిలిపవేయాలని,బూటకపు ఎన్కౌంటర్ లను నిలిపి వేయాలని,ఆదివాసీలపై పెట్టినా అక్రమ కేసులను ఎత్తివేయాలని,చెత్తిస్గడ్ ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరుపాలని,ఈ బూటకపు ఎన్కౌంటర్స్ పాల్పడిన పాల్పడిన పోలీసుల పై హత్య నేరం మోపి కటినంగా శిక్షంచాలని, డిమాండ్ చేసింది.















