హైదరాబాద్ ఏప్రిల్ 4 (ఈతరం భారతం న్యూ స్);వేసవి ఎండలకు మూగజీవాలు మృత్యువాత పడకుండా తక్షణమే ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థల కార్యాలయాల పరిధిలో అల్పప్రాణుల దాహర్తి తీరేందుకు అవసరమైన నీటి గిన్నెలు, తొట్లు ఏర్పాటు జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ అధ్యక్షులు ఎస్సీ హెచ్ రంగయ్య తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన ఒక మీడియా ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో 42 దిగ్రీల పైగా ఎండలు భయపెడుతున్నాయని పిచ్చుకలు, పావురాలు, వీధి కుక్కలు, పిల్లులు లాంటి మూగజీవాలు తీవ్ర ఇబ్బంది పడే అవకాశం ఉందని ఆయన గుర్తు చేశారు. మూగజీవాలకు మరింత మేలు జరిగేలా పురపాలక పట్టణాభివృద్ధి శాఖలు వీధుల వెంట ప్రత్యేకంగా మంచినీరు ఏర్పాటు చేసేలా ఆదేశించాలని కోరారు. ప్రభుత్వం తక్షణమే సరైన చర్యలు తీసుకోని జీవవైవిధ్యాన్ని కాపాడాలని రంగయ్య కోరారు.















