4.4.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల, ఖమ్మం.
రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి భారీ మెజార్టీయే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు పిలుపునిచ్చారు. గురువారం సత్తుపల్లి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని సత్తుపల్లిలో అసెంబ్లీ కన్వీనర్ భాస్కర్ని వీరంరాజు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో జిల్లా మాజీ అధ్యక్షులు స్వర్గీయ శ్రీ దారపునేని కోటేశ్వరరావు గారి చిత్రపటానికి నివాళులు అర్పించారు.
కార్యక్రమంలో తాండ్ర వినోద్ రావు గారు మాట్లాడుతూ కార్యకర్తలు బూత్ ల వారీగా ఒక్కొక్కరు వంద ఓట్లను సమకూర్చేందుకు కష్టపడి పనిచేయాలని సూచించారు. బిజెపి పార్టీ సంస్థ గత నిర్మాణం జరిగేలా ప్రతి నాయకుడు,కార్యకర్త పాటుపడాలని రానున్న ఎన్నికల్లో బిజెపి పార్టీ గెలుపుకి, అనుసరించాల్సిన విధివిధానాలపై, కేంద్ర ప్రభుత్వపథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ,పార్టీ బలోపేతానికి కార్యకర్తలు, బూత్ స్థాయి నాయకులు కృషి చేయాలని అన్నారు.
ప్రధాని మోడీ నాయకత్వం లో గడిచిన 10 ఏళ్ళ లో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఖమ్మం పార్లమెంట్ కి 12000 కోట్ల రూపాయలను అభివృద్ధి మరియు వివిధ పథకాల కోసం ఖర్చు చేయడం జరిగిందన్నారు. వ్యవసాయ , పారిశ్రామిక రంగాల్లో ఖమ్మం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
అయోధ్య నుండి భద్రాచలం వరకు అధ్యాత్మిక కారిడర్ కోసం మోడీ గారికి ప్రతిపాదిస్తాం అన్నారు.దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని, 500 ఏళ్లుగా ఎదురుచూస్తున్న రామమందిర నిర్మాణం, 375 ఆర్టికల్ రద్దు చేసి కాశ్మీర్ భారతదేశంలో కలిపిన ఘనత ప్రధానమంత్రి నరేంద్రమోదీకే దక్కుతుందని అన్నారు. బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ మాట్లాడుతూ కార్యకర్తలు గ్రామస్థాయిలో విస్తృతంగా భారతీయ జనతా పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై గ్రామాల్లో, ప్రజల్లో చర్చించి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ప్రభారి శ్రీకాంత్, పార్లమెంటు కన్వీనర్, నంబూరు రామలింగేశ్వర రావు, నియోజకవర్గ కన్వీనర్ భాస్కర్ని వీరంరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యామ్ రాథోడ్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు చావా కిరణ్, స్టేట్ కౌన్సిల్ సభ్యులు మట్టా ప్రసాద్, జిల్లా కార్యదర్శి నాయుడు రాఘవరావు, సుదర్శన్ మిశ్రా, కిసాన్ మోర్చ జిల్లా ఉపాధ్యక్షులు బాలకృష్ణారెడ్డి, మండల అధ్యక్షులు పాలకొల్లు శ్రీనివాస్, పర్సా రాంబాబు, బొర్రా నరసింహారావు, ఆచంట నాగస్వామి, ఆపద రామారావు, పుల్లారావు, MRPS నాయకులు గొల్లముడు శ్రీను, కొలిగపోగు వెంకటేశ్వర్లు, ముత్తారావు, టిడిపి రాష్ట్ర నాయకులు పారుపల్లి సురేష్, తదితర నాయకులు పాల్గొన్నారు.















