ఈతరం భారతం హైదరాబాద్ ప్రతినిధి ఎప్రిల్ 5, 2024 : మరో నాలుగు రోజుల్లో రాబోతున్న నూతన తెలుగు సంవత్సరం ఉగాది క్రోధి నామ సంవత్సర పంచాంగాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్పు ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్యకు అందించారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి. ఈ సందర్భంగా డాక్టర్ వంగపల్లి మాట్లాడుతూ శాసన సభ్యునిగా ఎన్నికైన నాలుగు మాసాల కాలంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు తనపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలలో ఆత్మస్థైర్యాన్ని నింపుతూ తన వద్దకు వచ్చే ప్రజలకు నేనున్నానంటూ ఆపన్న హస్తం అందిస్తున్న ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య గారికి ఈరోజు నూతన సంవత్సర పంచాంగము , తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని బహుకరించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.















