5.4.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల, ఖమ్మం.
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో శుక్రవారం సత్యా గ్రహ దీక్ష ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు మాట్లాడుతూ- కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేముందు రైతుల సమస్యలు తీరుస్తామని తెలిపి రైతులను అరిగోస పెడుతున్నదని మండిపడ్డారు. వ్యవసాయాన్ని అప్పట్లో బీ అర్ ఎస్ ప్రభుత్వం దెబ్బతీస్తే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందన్నారు . పంటలు ఎండి రైతులు అవస్థలు పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక యాక్షన్ ప్లాన్ ఇవ్వకుండా రాజకీయం చేయడం అన్యాయమన్నారు. రైతుల పక్షాన బిజెపి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. దేశానికి వెన్నెముక అయిన రైతుల ఆత్మ గౌరవం కోసమని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న వ్యవసాయానికి పెట్టుబడి, ఫసల్ యోజన వంటి అనేక అద్భుత పథకాలు రైతన్నలను ఆదుకుంటున్నాయని , అండ దండగా ఉంటున్నాయని ఆన్నారు. రైతు బిడ్డగా తనకు ఇక్కడి రైతుల కోసం ఒక విజన్ ఉందని, గిట్టుబాటు ధర రావడానికి, వ్యవసాయానికి డిమాండ్ పెరగడానికి సత్వర చర్యలు తీసుకో వాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సేంద్రీయ వ్యవసాయానికి డిమాండ్ పెరిగిందని కాబట్టి ఇక్కడ పామాయిల్ అభివృద్ధికి, హార్టికల్చర్ అభివృద్ధికి కృషి చేస్తామని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కిసాన్ మొర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. వరి ధాన్యం క్వింటాల్ కు రూ.500 బోనస్ వెంటనే ఇవ్వాలని అన్నారు. రెండు లక్షలలోపు బ్యాంకు రుణాలను మాఫీ చేయాలని, కరవుతో నష్టపోయిన రైతులకు రూ.25 వేల నష్టపరిహారాన్ని అందించాలని, అదేవిధంగా రైతు కూలీలకు రూ.12 వేలను బ్యాంకు అకౌంట్లలో జమ చేయాలని, రైతు భరోసా ద్వారా రూ.15 వేలను రైతులకు అందించాలని శ్రీధర్ రెడ్డి, వినోద్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ గారు, పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వర్ రావు గారు, అసెంబ్లీ ఇంచార్జి బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి , కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు చావ కిరణ్ గారు, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎల్లా రావు గౌడ్ ,
జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి కాసాని సీతారామయ్య , జిల్లా కార్యదర్శి నరికుల వెంకటేశ్వర్లు , భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో శుక్రవారం సత్యా గ్రహ దీక్ష ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు మాట్లాడుతూ- కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేముందు రైతుల సమస్యలు తీరుస్తామని తెలిపి రైతులను అరిగోస పెడుతున్నదని మండిపడ్డారు. వ్యవసాయాన్ని అప్పట్లో బీ అర్ ఎస్ ప్రభుత్వం దెబ్బతీస్తే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందన్నారు . పంటలు ఎండి రైతులు అవస్థలు పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక యాక్షన్ ప్లాన్ ఇవ్వకుండా రాజకీయం చేయడం అన్యాయమన్నారు. రైతుల పక్షాన బిజెపి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. దేశానికి వెన్నెముక అయిన రైతుల ఆత్మ గౌరవం కోసమని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న వ్యవసాయానికి పెట్టుబడి, ఫసల్ యోజన వంటి అనేక అద్భుత పథకాలు రైతన్నలను ఆదుకుంటున్నాయని , అండ దండగా ఉంటున్నాయని ఆన్నారు. రైతు బిడ్డగా తనకు ఇక్కడి రైతుల కోసం ఒక విజన్ ఉందని, గిట్టుబాటు ధర రావడానికి, వ్యవసాయానికి డిమాండ్ పెరగడానికి సత్వర చర్యలు తీసుకో వాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సేంద్రీయ వ్యవసాయానికి డిమాండ్ పెరిగిందని కాబట్టి ఇక్కడ పామాయిల్ అభివృద్ధికి, హార్టికల్చర్ అభివృద్ధికి కృషి చేస్తామని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కిసాన్ మొర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. వరి ధాన్యం క్వింటాల్ కు రూ.500 బోనస్ వెంటనే ఇవ్వాలని అన్నారు. రెండు లక్షలలోపు బ్యాంకు రుణాలను మాఫీ చేయాలని, కరవుతో నష్టపోయిన రైతులకు రూ.25 వేల నష్టపరిహారాన్ని అందించాలని, అదేవిధంగా రైతు కూలీలకు రూ.12 వేలను బ్యాంకు అకౌంట్లలో జమ చేయాలని, రైతు భరోసా ద్వారా రూ.15 వేలను రైతులకు అందించాలని శ్రీధర్ రెడ్డి, వినోద్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ గారు, పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వర్ రావు గారు, అసెంబ్లీ ఇంచార్జి బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి , కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు చావ కిరణ్ గారు, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎల్లా రావు గౌడ్ , జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి కాసాని సీతారామయ్య , జిల్లా కార్యదర్శి నరికుల వెంకటేశ్వర్లు , ప్రధాన కార్యదర్శి శ్యామ్ రాథోడ్ గారు, నున్న రవి గారు , మంద సరస్వతి గారు, గుగులోత్ నాగేశ్వర్ రావు ,కిసాన్ మోర్చా జిల్లా నాయకులు మరియు జిల్లా పార్టీ నాయకులు,కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.















