EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

మద్రాస్ యూనివర్సిటీలో కట్టెకోలకు సత్కారం : తెలుగు శాఖ అభినందనలు

ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల. ఏప్రిల్ 5,2024మద్రాస్ యూనివర్సిటీలో కట్టెకోలకు సత్కారం. తెలుగు శాఖ అభినందనలు.మద్రాస్ విశ్వవిద్యాలయంలో ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖ కవి, రచయిత, సీనియర్ జర్నలిస్ట్ కట్టెకోల చిన నరసయ్యకు ఘన సత్కారం లభించింది. మద్రాస్ మెరీనా బీచ్ ఆవరణ రజతోత్సవ ప్రాంగణంలో శుక్రవారం యూనివర్సిటీ తెలుగు శాఖ ఆధ్వర్యంలో ఆ శాఖ అధ్యక్షులు ఆచార్యులు విస్తాలి శంకరరావు అధ్యక్షతన శ్రీ క్రోధి ఉగాది వేడుకలను నిర్వహించింది. వేడుకలలో భాగంగా దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన తెలుగు కవులతో మద్రాస్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ చెన్నైకి చెందిన కవయిత్రి నిడమర్తి వసుంధరా దేవి నిర్వహణలో కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ కవి సమ్మేళనంలో కట్టెకోల చిన నరసయ్య పాల్గొని కవితను ఆలపించారు. అనంతరం చెన్నైకి చెందిన ప్రముఖ సినీ గేయ రచయిత భువనచంద్ర, తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్యులు విస్తాలి శంకరరావులు కట్టెకోలను శాలువతో సత్కరించి, ప్రశంశాపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పలు పలువురు ప్రముఖులు ఆయనను అభినందించారు.

Related News

Select the Topic
Scroll to Top