ఈతరం భారతం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 6,2024 : ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి ఆధ్వర్యంలో శ్రీ క్రోధి నామ సంవత్సర నూతన పంచాంగాల పంపిణీ శనివారం జరిగింది. స్థానిక ఆర్యవైశ్య సంఘం నాయకులకు పంపిణీ చేశారు. ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పసుపు నూరి వీరేశం, మండల అధ్యక్షుడు సముద్రాల కుమార్, పట్టణ అధ్యక్షుడు అయిత వెంకటేష్ లకు నూతన పంచాంగాలు అందజేశారు.
రాబోయే తెలుగు నూతన సంవత్సరం సకల శుభాలు అందజేయాలని అంజయ్య స్వామి ఆకాంక్షించారు.















