EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

యస్.బి.ఐ.టి. లో ముగిసిన వృత్తినైపుణ్య శిక్షణా తరగతులు

6.4.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల, ఖమ్మం.

విద్యార్థులకు విద్యతో పాటు వృత్తి నైపుణ్య మెళకువలు కూడా అవసరమని గుండాల కృష్ణ తెలిపారు. శనివారంతో ఆరు రోజుల శిక్షణా తరగతులు ముగింపు వేడుకలకు హాజరైన కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ పలు ప్రవేశ పరీక్షలకు సమయపాలనతో పాటు మెళకువలు కూడా ముఖ్యమని దిశానిర్ధేశం చేసారు.

సి.ఆర్.టి. పేరుతో నిర్వహించే ఈ శిక్షణా తరగతులు విద్యార్థులకు పలు బహుళ జాతి కంపెనీల ఎంపికలో క్రియాశీలకంగా ఉంటుంది అని, ఈ శిక్షణలో తక్కువ సమయంలో ప్రశ్నలకు సమాదానం ఇచ్చే మెళకువలు, ఎనలిటికల్ స్కిల్స్ప అవగాహాన కల్పిస్తారని కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డా॥ జి. ధాత్రి తెలిపారు. ఈ శిక్షణలో సి.యస్.సి, ఈ.సి.ఈ, ఈఈఈ, మెకానికల్ మరియు సివిల్ విద్యార్థులకు అందించామని, తద్వారా అన్ని పోటీ పరీక్షలకు సిద్ధంగా ఉంటారని వారు తెలిపారు.

ఆప్టిట్యూడ్, రీజనింగ్ తో పాటుగా ప్రాబ్లమ్ సాల్వింగ్ పై అవగాహాన కల్పించామని కళాశాల ప్రిన్సిపల్ డా॥ జి. రాజ్కుమార్ తెలిపారు. జాతీయ స్థాయిలో జరిగే బహుళ జాతి కంపెనీల ప్రవేశానికి కావలసిన పూర్తి శిక్షణను ఈ ఆరు రోజులలో అందిచామని వారు తెలిపారు. టీవియస్, ఇన్ఫోసిస్ మరియు హెచ్ సీయల్ వంటి కంపెనీల రిక్రూట్మెంట్ను అనుసరించి గతంలో వచ్చిన ప్రశ్నాపత్రాలను నమూనాగా తీసుకొని శిక్షణనిప్పించినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా శిక్షకులను అభినందించి సన్మానించారు.

ఈ కార్యక్రమంలో శిక్షకులు బాషా, పి. ధీరజ్, కె. దుర్గాప్రసాద్, కళాశాల వైస్ ప్రిన్సిపల్ డా|| కె. అమిత్ బంధాజ్, అకడమిక్ డైరెక్టర్స్, గంధం శ్రీనివాసరావు, డా॥ ఎ.వి.వి. శివ ప్రసాద్, జి. ప్రవీణ్ కుమార్, డా|| జె. రవీంద్రబాబు. డా॥ యన్. శ్రీనివాసరావు, టి.పి.ఒ.యన్. సవిత, కోఆర్డినేటర్ జి. ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top