EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

కాంగ్రెస్ గూటికి సరూర్నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ అనితా దయాకర్ రెడ్డి?

హైదరాబాద్ ఏప్రిల్ 6 (ఈతరం భారతం న్యూ స్);మహేశ్వరం నియోజకవర్గం సరూర్నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ అనితా దయాకర్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు విశ్వాసం సమాచారం. అనిత దయాకర్ రెడ్డి పార్టీ మారడం అనివార్యమైతే సబితా ఇంద్రారెడ్డికి కోలుకొని దెబ్బ. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో సబితా రెడ్డి విజయానికి అనిత దయాకర్ రెడ్డిలు ముఖ్య భూమిక పోషించారు. మీరు పార్టీ మారడానికి ఎమ్మెల్యే నియత్రుత్వ పోకడ ఒక కారణమని అనిత రెడ్డి అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.వీరు కాంగ్రెస్ పార్టీలోకి రావటానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రేస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి లు వత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. మీరు పార్టీ మారడంతో భారతీయ రాష్ట్ర సమితికి కనీసం బూతు స్థాయి సభ్యులు కూడా దొరకని పరిస్థితి కనిపిస్తుంది.అనిత దయాకర్ రెడ్డిల చేవెళ్ల పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి ఎంతో దోహదపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

 

 

Related News

Select the Topic
Scroll to Top