ఈతరం భారతం హైదరాబాద్ ప్రతినిధి ఏప్రిల్ 7, 2024 : హైదరాబాదులో ప్రయాణికులకు అందించే పలు రాయితీలను మెట్రో రైల్ అధికారులు నిలిపివేశారు .59 రూపాయల హాలిడే కార్డు , మెట్రో కార్డు పై ఇచ్చే పది శాతం రాయితీలను రద్దు చేశారు. రాష్ట్రంలో పెరిగిన ఎండలతో మెట్రో ప్రయాణానికి భారీగా డిమాండ్ పెరిగింది .ఈ నేపథ్యంలో డిస్కౌంట్ ఆఫర్లను రద్దు చేస్తూ మెట్రో రైల్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై మెట్రో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు















