ఈతరం భారతం హైదరాబాద్ ప్రతినిధి 6. 4 .2024 : ఆహార పదార్థాల కల్తీ లో హైదరాబాద్ నగరం ప్రథమ స్థానంలో నిలిచిందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకటించింది . దేశవ్యాప్తంగా మొత్తం 19 ప్రధాన నగరాల్లో ఏడాదిలో 291 కేసులు నమోదు కాగా అందులో 241 కేసులు హైదరాబాదువి కావడం విశేషం గరం మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్టులు ఇంకా ఇతర ఎన్నో కల్తీ దినుసులు నగరంలో అమ్ముతున్నారని తేలింది .ఇవి తిన్న వినియోగదారులు తీవ్రమైన రోగాల బారిన పడుతున్నారని తెలిసింది.















