EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

జర్నలిస్టులను బెదిరించిన మాజీ సర్పంచ్ భర్త పి శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలి      తెలంగాణ ఎడిటర్స్ అసోసియేషన్ జిల్లా కలెక్టర్ కి వినతి

మేడ్చల్ మల్కాజ్గిరి ఏప్రిల్ 8 (ఈతరం భారతం న్యూస్); జర్నలిస్టులను బెదిరించిన మాజీ సర్పంచ్ భర్త పి శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఎడిటర్స్ అసోసియేషన్ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు.కీసర మండలం చీర్యాల గ్రామపంచాయతీ పరిధిలో వ్యవసాయం పంటలు పండించాల్సిన భూముల్లో అక్రమ నిర్మాణాలను మాజీ సర్పంచ్ భర్త పి శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. వివరణ కొరకై వెళ్లిన జర్నలిస్టులను చంపుతానని బెదిరించిన పి శ్రీనివాస్ పై తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.వ్యవసాయ భూమిని రెసిడెన్షియల్, కమర్షియల్ భూములుగా కన్వర్ట్ చేయకుండా యదేచ్చిగా అక్రమంగా కమర్షియల్ షెడ్ లను నిర్మిస్తున్నారు. దీని ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని గండి కొడుతున్నారు. దీనిపై వివరణ కోరిన జర్నలిస్టులను మాజీ సర్పంచ్ భర్త పి శ్రీనివాస్ పరుష పదజాలంతో దూషించి, చంపుతానని బెదిరించడాన్ని తెలంగాణ ఎడిటర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తున్నది. చీర్యాల గ్రామంలో దాదాపు రెండు ఎకరాల వ్యవసాయ భూములో పెద్ద పెద్ద రెండు షెడ్లను నిర్మిస్తున్నారు. ఇటీవల గ్రామ పంచాయతీ కార్యదర్శి ఈ షెడ్ల నిర్మాణానికి ఎటువంటి అనుమతులు లేవని వీటి నిర్మాణ ఆపమని నోటీసు జారీ చేసినప్పటికీ, నేనెవరి మాట వినను అంటూ నిర్మాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఇదంతా చీర్యాల గ్రామ మాజీ సర్పంచ్ భర్త పి శ్రీనివాస్ దగ్గరుండి నిర్వహిస్తున్నట్లు గ్రామ ప్రజలు చెబుతున్నారు. కావున జిల్లా కలెక్టర్ ఈ విషయాలపై విచారణ జరిపించి, అక్రమ కట్టడాలపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ నాయకులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎడిటర్స్ అసోసియేషన్ నాయకులు జి హరిప్రసాద్, ఐ సత్యనారాయణ, భూపేంద్ర, డి అరుణ్ కుమార్, రోజా రాణి తదితరులు పాల్గొన్నారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top