ఈతరం భారతం శ్రీశైలం ప్రతినిధి ఏప్రిల్ 9, 2024 : క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదినము సందర్భంగా శ్రీశైలం ఆలయంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి పెద్దిరాజు ఆధ్వర్యంలో ముందుగా గణపతి పూజ తర్వాత పుణ్యాహవాచనం, పంచాంగ పూజ నిర్వహించారు. ఆలయం పండితులు పంచాంగ శ్రవణ కార్యక్రమంలో నూతన సంవత్సర ఫలితాలను భక్తులకు తెలియజేశారు .ఉగాది పచ్చడి పంపిణీ చేసి ప్రసాదాలు అందించారు.















