న్యూఢిల్లీ ఏప్రిల్ 10 (ఈతరం భారతం న్యూస్ );: దేశ రాజధాని ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అయిన తర్వాత ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని కోరుతూ పదే పదే పిటిషన్లు దాఖలు అవుతుండటంపై ఢిల్లీ హైకోర్టు బుధవారం అసంతృప్తి వ్యక్తం చేసింది. న్యాయస్థానం ఈ పిటిషన్లపై ఇదివరకే సమాధానం ఇచ్చిందని తెలిపింది. ఇది సీక్వెల్‌లను కలిగి ఉండే జేమ్స్ బాండ్ చిత్రం కాదని.. ఈ విషయంలో “రిపీట్ లిటిగేషన్” ఉండకూడదని.. మళ్లీ మళ్లీ పిటిషన్లు దాఖలు చేయవద్దని స్పష్టం చేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్‌పై విచారణ జరిపింది. రాజకీయ చిక్కుముడిలోకి కోర్టును లాగాలని ప్రయత్నించి, వ్యవస్థను అపహాస్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొంటూ పిటిషనర్ సందీప్ కుమార్‌పై రూ.50 వేల ఫైన్ విధించింది.”సీక్వెళ్లు ఉండటానికి ఇది జేమ్స్ బాండ్ సినిమా కాదు. లెఫ్టినెంట్ గవర్నర్ సమస్యను పరిష్కరిస్తారు. మమ్మల్ని రాజకీయాల్లోకి లాగడానికి ప్రయత్నిస్తున్నారు” అని కోర్టు పేర్కొంది. రాజధానిలో గవర్నర్ పాలన విధించలేమని జస్టిస్ మన్మీత్ పీఎస్ అరోరాతో కూడిన ధర్మాసనం పునరుద్ఘాటించింది. మార్చి 28న అరవింద్ కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తొలగించాలని కోరుతూ దాఖలైన పిల్‌ను కోర్టు కొట్టివేసింది.















