ఈతరం భారతం యాదాద్రి భువనగిరి ప్రతినిధి ఎప్రిల్ 11,2024 : యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల లోని అన్ని గ్రామాలలో, పట్టణాలలో గురువారం రంజాన్ వేడుకలు భక్తి శ్రద్ధలతో ఎంతో ఘనంగా జరిగాయి. ఈద్గాల వద్ద ప్రత్యేక నమాజ్ లు జరిగాయి. ఎంఎల్ఏలు, ముఖ్య నాయకులు, ప్రముఖులు ఈద్గాల వద్దకు వెళ్లి ముస్లింలకు ఈద్ ముబా రక్ చెప్పారు. తమ పెద్దల పేరిట పేదలకు ముస్లింలు కానుకలు అందజేశారు. అన్ని ఈద్గాల వద్ద సదర్ లు రంజాన్ సందేశాలను వినిపించారు. ఎంతో ఘనంగా పండగ జరిగి ప్రశాంతంగా ముగిసింది.















