11.4.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల, ఖమ్మం.
జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ లో స్వర్గీయ మహత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి కార్యక్రమం.ముందుగా జిల్లా కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు పువ్వాల్ల దుర్గాప్రసాద్ , జిల్లా OBC సెల్ అద్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, నగర కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు లు పూలే గారి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించినారుఆనంతరం పువ్వాల్ల దుర్గాప్రసాద్,మహ్మద్ జావేద్, రాయల నాగేశ్వరరావు, కమర్తపు మురళి మాట్లాడుతూ పూలే గారు అంటరానితనం, కులవ్యవస్థ నిర్ములనతోపాటు మహిలోద్దరణకు కృషి చేశారని,1873 సెప్టెంబర్ 24 న, వారు తన అనుచరులతో కలిసి దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులు పొందటానికి సత్యశోధక్ సమాజ్ ను ఏర్పాటు చేసి అనగారిన వర్గాల అభ్యున్నతికి కోసం పని చేసే ఈ సంఘంలో అన్ని మతాలు, కులాల ప్రజలు చేరవచ్చని లాగ్రేంజ్ లోని సామాజిక సంస్కరణ ఉద్యమంలో ఫూలే గారు ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణింప బడ్డారని , వారు వారి సతీమణి సావిత్రి భాయి ఫూలేతో కలిసి వితంతువుల కోసం ఒకగృహాన్ని నిర్మించారని, భారత దేశ బాలికల కోసం ఒక పాఠశాల ప్రారంభించిన మొట్ట మొదటి స్థానిక భారతీయులలో ఈ జంట ఉన్నారని, విద్య యొక్క విశ్వీకరణను సమర్ధించిన మొట్ట మొదటి సంస్కర్త అని కొనియాడుతూ వారు చూపిన బాటలో పయనించడమే మనం వారి కిచ్చే ఘణ నివాళులని అన్నారు
ఈ కార్య్రమంలో వీరితో పాటు పి సి సి సభ్యులు వడ్డే నారాయణరావు,జిల్లా కిసాన్ కాంగ్రెస్, మైనారిటీ అద్యక్షులు మొక్కా శేఖర్ గౌడ్,సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, జిల్లా OBC సెల్ ఉపాద్యక్షులు గజ్జెళ్లి వెంకన్న,కార్పొరేటర్ రాపర్తి శరత్ కుమార్, మాజి కౌన్సిలర్ పాలకుర్తి నాగేశ్వరరావు, తూములూరి లక్ష్మీనరసింహారావు , కమతాల రామక్రిష్ణ,మైఫూజ్, కరేం, గడ్డం వెంకటయ్య,INTUC అటో యూనియన్ అద్యక్షులు విప్లవ కుమార్, కండుల శ్రీను, రామారవు,నల్లమోతు రవి, ఏపూరి మల్లిఖార్జునరావు, తావిడబోయిన రవి, ధనలక్ష్మి, స్వరూపరాణి, ఏకలక్ష్మి తదితర నాయకులు పాల్గొన్నారు















