హైదరాబాద్ ఏప్రిల్ 12 (ఈతరం భారతం న్యూస్ );కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం 2 లక్షల ఉద్యోగాల భర్తీకై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం వందలాది మంది నిరుద్యోగులు ఉస్మానియా యునివర్సిటి నుండి విద్యానగర్ బి.సి భవన్ వరకు ర్యాలీగా వచ్చారు. గ్రూప్-1 సర్వీస్ కింద 503 పోస్టులు ప్రకటించారు. కానీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోట పోస్టులు కరెక్టుగా లెక్కిస్తే 1600కు, గ్రూప్-2 సర్వీస్ కింద 783 పోస్టులు భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు. వీటిని కూడా కరెక్టు గా లెక్కిస్తే 2200 లకు, గ్రూప్ III పోస్టులు 1383 వాస్తవంగా 3వేలకు పైగా ఉన్నవి, గ్రూప్-4 సర్వీస్ కోటా కింద 8500 పోస్టులు ప్రకటించారు. ఇవి 25 వేలకు పైగా ఉంటాయి. టీచర్ పోస్టులు 11వేలు ప్రకటించారు. PRC రిపోర్ట్ ప్రకారం 25 టీచర్ పోస్టులు ఖాళీగా యున్నవని తెలిపారు. ఈ సదస్సుకు ముఖ్య అతిధిగా జాతీయ బి.సి సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు.















