EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

7వ రోజు భద్రాచలం పాదయాత్రకు మంగళహారతులతో స్వాగతం పలికిన ఖమ్మం పట్టణం

13.4.2024 రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల, ఖమ్మం.

భాగ్యనగరం నుంచి భద్రాచలం వరకు తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కమిటీ చేపట్టిన పాదయాత్ర 7వ రోజు ఖమ్మం పట్టణంకు చేరుకుంది. ఖమ్మం జిల్లా, ఖమ్మం పట్టణం సగర సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో ఈ పాదయాత్రకు మద్దతు తెలుపుతూ స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులతో వీర తిలకం దిద్ది స్వాగతించారు. అనంతరం ఖమ్మం పట్టణంలో పాదయాత్రలో భాగస్వాములయ్యారు. పాదయాత్రను కొనసాగిస్తున్న తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర, రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షులు మర్క సురేష్ సగర, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చీర్ల విష్ణుసగర, రాష్ట్ర సంఘం నాయకులు బూరుగుపల్లి గణేష్ సగర, ఎదటి తిరుమలేష్ సగర లతో కలిసి ఖమ్మం జిల్లాకు చెందిన జిల్లా అధ్యక్షులు సోమ అశోక సగర, పట్టణ అధ్యక్షులు పేశెట్టి వెంకన్న సగర, రాష్ట్ర ఉపాధ్యక్షులు అనిశెట్టి శంకరయ్య సగర, జిల్లా కోశాధికారి ఉదయ సగర, స్థానిక జిల్లా నాయకులు, పట్టణ సంఘం నాయకులు మహిళా సంఘం, యువజన సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Related News

Select the Topic
Scroll to Top