ఈతరం భారతం హైదరాబాద్ ప్రతినిధి ఏప్రిల్ 14,2024 : హైదరాబాద్ నగరం బోడుప్పల్ సిద్ధార్ధ్ స్కూల్ ఎదురుగా ఉన్న వైన్ షాపును ఎత్తివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఎదురుగా స్కూలు, పక్కనే గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ఉందని ఇక్కడ వైన్ షాప్ తో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు .ఈ విషయమై పోలీసులను సంప్రదిస్తే షాపు పెట్టడానికి అనుమతులు ఉన్నాయని తాము ఏమీ చేయలేమని చెప్పినట్లు సమాచారం .దీంతో ఆ వైన్ షాప్ ను ఇక్కడి నుంచి తొలగించాలని స్థానికులు ఆందోళన మార్గం పట్టారు















