EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వైసీపీ ప్రభుత్వం    ఎస్‌.కోట నియోజకరవ్గ టీడీపీ అభ్యర్థి కోళ్ల లలితకుమారి

శృంగవరపుకోట ఏప్రిల్ 14 (ఈతరం భారతం న్యూస్ );: వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని ఎస్‌.కోట నియోజకరవ్గ టీడీపీ అభ్యర్థి కోళ్ల లలితకుమారి ఆరోపిం చారు. శృంగవర పుకోట గాంధీనగర్‌లో ఎన్ని కల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ సండి సోమేశ్వరరావు, వైస్‌ఎంపీపీ ఇందుకూరి సుధారాణి, సర్పంచ్‌ గనివాడ సంతోషికుమారి, టీడీపీ నాయకులు జీ.ఎస్‌ నాయుడు, రెడ్డి వెంకన్న, కొణదం మల్లేశ్వరరావు, వాకాడ బాలు, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.ఫశృంగవరపుకోట రూరల్‌: మండలంలోని ధర్మవరంలో మాజీ సర్పంచ్‌ వైసీపీ నేత గొర్లె దేముడు ఆధ్వర్యంలో 50 ఎరుకుల, 50 యాత కుటుంబాలు వైస్‌ ఎంపీపీ ఇందుకూరి సుధారాజు ఆధ్వర్యంలో టీడీపీలో చేరాయి. ఈ సందర్భంగా కూటమి అభ్యర్థి లలితకుమారి, సుధారాజు,గొంప కృష్ణ మాట్లాడుతూ అన్ని వర్గాలు వైసీపీని బంగాళాఖాతంలో తోసేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కార్యక్ర మం లో సర్పంచ్‌ గాలి సన్యాసయ్య, జీఎస్‌ నాయుడు,రెడ్డి వెంకన్న, రాయరవపు చంద్ర శేఖర్‌, జుత్తాడ రామసత్యం, న్యాయవాది మండా కామేశ్వరరావు పాల్గొన్నారు.ఫవేపాడ:వేపాడకు చెందిన వైసీపీ నాయకుడు భోజంకి లక్ష్మ ణరావు శుక్రవారం రాత్రి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోల్ల బుచ్చి అప్పల రాంప్రసాదు సమ క్షంలో టీడీపీలో చేరారు. సింగరాయిలో శుక్రవారం రాత్రి జయహో బీసీ నిర్వహిం చారు.కార్యక్రమంలో నాయకులు నిరుజోగి దాలినాయుడు, రంభ శంకరరావు, సూరి దేముడు, నిరుజోగి బంగారునాయుడు, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కొట్యాడ రమణమూర్తి, పార్టీ మండల ఉపాధ్యక్షుడు పోతల వెంకటరమణ, మాజీ ఎంపీపీ దాసరి లక్ష్మి పాల్గొన్నారు

 

 

 

Related News

Select the Topic
Scroll to Top