అమరావతి ఏప్రిల్ 14 (ఈతరం భారతం న్యూస్ ); అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో వైసీపీని( భూస్థాపితం చేయాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. పాయకరావుపేటలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. “ఎస్సీలకు సంబంధించి 27 పథకాలను జగన్ రద్దు చేశారు. అంబేడ్కర్‌కు భారత రత్న రావడానికి మాజీ సీఎం స్వర్గీయ ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారు.అంబేడ్కర్ ఆశయ సాధన కోసం అందరూ పాటుపడాలి. ఆయన రచించిన రాజ్యాంగం ఎంతో గొప్పది. అంబేడ్కర్ ఆశయాలను జగన్ తుంగలో తొక్కాడు. జగన్ వస్తే గంజాయి వస్తుంది. అంటరానితనాన్ని టీడీపీ నిషేధించింది. రూ.500 కోట్లతో జగన్ ప్యాలెస్ కట్టుకుని.. ప్రజలకు మాత్రం చిన్న ఇల్లు కట్టించలేకపోయాడు.















