EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన రిటైర్ సీఐ పుల్లూరు నాగయ్య

14.4.2024 రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల, ఖమ్మం.

జెడ్పీ సెంటర్ నందు బాబా సాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా రిటైర్ సీఐ పుల్లూరు నాగయ్య  చేతుల మీదుగా అంబేద్కర్  విగ్రహానికి పూలమాలవేసి పూలతో నివాళులర్పించారు. సంఘం అధ్యక్షులు పి ఆర్ దేవి  అధ్యక్షత సిఐ పుల్లూరు నాగయ్య  మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల నాయకుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిన్ననాడే చదువు కోసం వెలివేయబడినారు .ఆ రోజుల్లో పీడిత వర్గాల ప్రజల కోసం నేను ఏదైనా చేయాలనే చేయాలని స్వభావంతో విత్తనం నాటారు .పీడిత వర్గాల ప్రజల కోసం ఆ రోజుల్లో ఆయన తీసుకున్న నిర్ణయం అంటరానితనం తాగునీరు కోసం మహత్ చెరువు నీరు ముట్టనివ్వలేదు. విద్య కోసం చదువు కొనసాగించిన ధీరుడు ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ అందరికోసం ఆయన రాజ్యాంగాన్ని రాశాడు కుటుంబం ఆలోచన కూడా లేకుండా భార్య రమాబాయి ప్రోత్సాహంతో పిల్లలు చనిపోయిన వెనకాడకుండా చేయూతనిచ్చారు. అంబేద్కర్ గారు రాజ్యాంగం తో చదువు విద్య వైద్యం స్వేచ్ఛ సమానత్వం అందరిని రాజుల్ని చేసిన మహనీయుల ఆశయాలను మనందరం కలిసికట్టుగా ముందుకు నడిపించాలని పిలుపునిచ్చారు  ఈ కార్య క్రమంలో సావిత్రిబాయి పూలే మహిళా సంఘం జిల్లా నాయకురాలు ఉపాధ్యక్షురాలు భూక్యా మణి ఉపాధ్యక్షురాలు కామన అనంతలక్ష్మి జిల్లా సహాయ కార్యదర్శి తిప్పర్తి రమ్య సహాయ కార్యదర్శి ఇనుపలూరి నాగలక్ష్మి జిల్లా నాయకులు భవాని చంద్రశ్రీ విజయ రమణ కోశాధికారి సత్యవతి తదితరులు పాల్గొన్నారు

Related News

Select the Topic
Scroll to Top