EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

విద్యా వ్యవస్థ లోపాలకి ఎవరు భాద్యులు? జై స్వరాజ్ పార్టీ జాతీయ అధికార ప్రతి నిధి కుమారి యామినీ లక్ష్మి

హైదరాబాద్ (ఈతరం న్యూస్ );తెలంగాణ రాష్ట్రం లో పూర్తిగా విద్యా వ్యవస్థ విఫలమైందని జై స్వరాజ్ పార్టీ జాతీయ అధికార ప్రతి నిధి కుమారి యామినీ లక్ష్మి విమర్శించారు. ఎంతో మంది హైదరాబాద్ సిటీ కి వచ్చి మంచిగా చదివి ఉద్యోగాలు సంపాందించాలని ఎంతో ఆశగా వస్తుంటారు.. కానీ ఈ తెలంగాణ రాష్ట్రం లో విద్యా వ్యవస్థ ఎంతో అవస్థలు పాలు చేస్తుంది విద్యార్థులని.. గత ప్రభుత్వం లోపాలకి ఎంతో మంది విద్యార్థులు బలి అయ్యారని పెర్కొన్నారు. కొంత మంది ఆత్మ హత్యలు చేసుకుని చనిపోయారు.. వీళ్ళకి, విద్యార్థుల కుటుంబాలకి ఎవరు న్యాయం చేసారు? అని కుమారి యామినీ లక్ష్మి ప్రశ్నించారు. ఇప్పుడు రాష్ట్రం లో జరుగుతున్న B. ED.. పరీక్షల పరిస్థితులు దుస్థితి లో ఉన్నాయని.. దానికి నిదర్శనం ప్రముఖ దుర్గా భాయ్ దేశ్ ముఖ్ కాలేజీ స్టాఫ్ నిర్లక్ష్యం వల్ల B. ED విద్యార్థుల హాల్ టికెట్స్ లో జాప్యం, అవకతవకలు.. ఇవన్నీ పరీక్ష రాయపోతున్న విద్యార్థులకి ఆందోళన కలిగించే అంశాలు.. అసలు ప్రతీ సారి పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్స్ లో అవకతవకలు.. స్కూల్స్, కాలేజెస్ నిర్లక్ష్య ధోరణి.. ఎందుకు? ఎప్పుడు సరి చేసుకుంటారు? ఎప్పుడు మంచి ఉన్నత విద్య నీ అందిస్తారు అని గత ప్రభుత్వాల పని తీరుని ఖండించారు. ప్రస్తుత ప్రభుత్వం అయినా వెంటనే స్పందించి సరైన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top