EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

భారత రాజ్యాంగం పోస్టర్ ఆవిష్కరణ

హైదరాబాద్ (ఈతరం భారతం న్యూ స్);సకల జన సేవా సంస్థలు జాతీయ అధ్యక్షులు జి ఎస్ కుమారస్వామి నిర్మాతగా వ్యవహరిస్తూ ప్రపంచ పర్యావరణ సంస్థ జాతీయ అధ్యక్షులు డాక్టర్ సిహెచ్ భద్ర దర్శకత్వం వహిస్తున్న డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం పోస్టర్ ను  ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం ఎదుట వివిధ ప్రజాసంఘాలతో కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ.. విశ్వరత్న ప్రపంచ మానవ హక్కుల పోరాట యోధుడు డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రోజు రోజుకి మార్పు చేయటానికి పాలకవర్గాలు కుట్ర పన్నుతున్నారన్నారు. ఈ కుట్రని ప్రజలందరూ తిప్పి కొట్టి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్న స్వతంత్ర భారతావని రాజ్యాంగబద్ధమైన హక్కులను రాజ్యాంగబద్ధమైన పాలన పౌరులందరికీ అందించవలసిన బాధ్యత ప్రస్తుతం పాలకులందరి మీద ఉందన్నారు. అందుకోసం పౌరులందరినీ జాగ్రత్తపరిచి రాజ్యాంగమే సర్వజనుల సకల జీవశర హక్కులను సంరక్షిస్తుంది కాబట్టి భారత రాజ్యాంగం షార్ట్ ఫిలింని పౌరులందరూ ఆదరించి మేధావులు సబండ వర్గాలు సకలజనులు దీవించే ముందుకు నడిపించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దర్శకుడు సి.భద్ర మాట్లాడుతూ.. ఈ దేశం మొత్తం రుణపడి ఉన్న ఏకైక నాయకులు మహాత్మ జ్యోతిబాపూలే దంపతులు మరియు నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మరియు వారి సతీమణి రమాబాయి అంబేద్కర్ లు మాత్రమేనని కొనియాడారు.ఈ దేశ ప్రజల నిజమైన ఆత్మగౌరవం, ఆత్మగౌరవ పత్రిక సకల జీవచరాలు సకల మానవులందరి హక్కుల కోసం ఉన్న ఏకైక గ్రంథం సర్వోన్నతమైన గ్రంథం భారత రాజ్యాంగం మాత్రమే అని ప్రతి పౌరుడికి భారత రాజ్యాంగం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు హక్కు కల్పించారన్నారు.ఈ ఓటు హక్కుని పౌరులందరూ సక్రమంగా సరైన వ్యక్తులకు సరైన సందర్భంలో వినియోగించుకోవాలని తెలిపారు. భారతదేశ భిన్నత్వంలో ఏకత్వాన్ని ఈ దేశ రాజ్యాంగాన్ని అందరూ చదువుకొని తెలుసుకొని రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసం ప్రతి పౌరుడు  ముందుకు సాగాలని ఐక్యంగా ముందుకు కదలని కోరారు.ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే బాబాసాహెబ్ జన్మదిన వేడుకలు 150 దేశాలలో అధికారికంగా నిర్వహిస్తున్నారు. ప్రపంచంలో ఇద్దరి వ్యక్తుల విగ్రహాలు మాత్రమే అత్యధికంగా కలిగి ఉండడం మనందరికీ గర్వకారణం అన్నారు

.

 

Related News

Select the Topic
Scroll to Top