ఈతరం భారతం యాదాద్రి భువనగిరి ప్రతినిధి ఏప్రిల్ 16,2024 : ఆలేరు మున్సిపల్ పరిధిలోని మూడవ అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం వార్షికోత్సవ సంబురాలలో భాగంగా బాలల నృత్యోత్సవం ఎంతో ఘనంగా జరిగింది. విభిన్న సంప్రదాయ వస్త్ర ధారణలో చిన్నారులు ఆకట్టుకున్నారు. పలు గీతాలపై నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. సామూహిక బృంద నృత్య, నాటిక ప్రదర్శనలలో తమ ప్రతిభను విద్యార్థులు ప్రదర్శించి తల్లిదండ్రులు, అంగన్వాడీ కేంద్ర నిర్వాహకులు ప్రశంసలు అందుకున్నారు. పిల్లల సందడితో అంగన్వాడీ కేంద్రంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో సాన్వి, గొర్ల వాత్సల్య, ఉపాసన, మమత, నైవిక, చిన్మయి, లక్కీ, వృతక్సందేశ్, బిట్టు, సాకేత్, శివ, అంగన్వాడీ టీచర్ పద్మ తదితరులు పాల్గొన్నారు.















