EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

కిడ్నీ రాళ్ల పీడితునికి వెస్సో చేయూత

విజయనగరం ఏప్రిల్ 17 (ఈతరం భారతం న్యూస్ );విజయనగరం మన్యం జిల్లా పార్వతీపురం నివాసి పట్నాన శ్రీనివాస రావు(35) వృత్తి రీత్యా ఎలక్ట్రీషియన్. ఆయనకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పది సంవత్సరాల క్రితం ఎలక్ట్రికల్ పని చేస్తుండగా పొరపాటున హైటెన్షన్ వైర్ల తాకిడికి గురై శరీరంలో సగ భాగం కాలిపోయింది. అయినప్పటికీ బ్రతుకు తెరువు కోసం ఇప్పటికీ ఎలక్ట్రికల్ వృత్తినే కొనసాగిస్తున్నారు. గత కొద్ది రోజులుగా కిడ్నీలో మల్టిపుల్ స్టోన్స్ తో విపరీతమైన నడుము నొప్పితో బాధ పడుతున్నారు. ఒకటికంటే ఎక్కువగా ఉన్న రాళ్ళను లేజర్ సర్జరీ ద్వారా మాత్రమే తొలగించటానికి వీలవుతుందని వారి వైద్యుల సలహా ఇచ్చారు. ఆరోగ్యశ్రీ లో వెసులుబాటు లేని ఈ చికిత్స కొరకు ఆర్థిక సహాయం చేయమని శ్రీనివాస రావు వెస్సో ను ఆశ్రయించారు.వెస్సో గౌరవ దాతల సహకారంతో శ్రీనివాస రావుకు రూ. 44,500/- అందచేసింది. ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షులు బంగారు తాతారావు విశ్వకర్మ మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులలో ఉన్న శ్రీనివాసరావు కు వైద్య ఖర్చుల నిమిత్తం సమయానికి ఆర్థిక సహాయం చేసి ఆదుకొన్న గౌరవ దాతలకు హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top