హైదరాబాద్ ఏప్రిల్ 17 (ఈతరం భారతం న్యూ స్);కోటి సమీపంలో జాంబాగ్ శ్రీ శ్రీ వీర హనుమాన్ మందిరం లో అంగరంగ వైభవంగా నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు పాల్గొన్నారు.అనంతరం దేవ స్థానం ట్రస్ట్ సభ్యులు డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు శేష వస్త్రం కప్పి, తీర్థ ప్రసాదాలు అందించారు. అర్చక స్వాములు వేద ఆశీర్వచనం అందజేశారు.















