EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఉస్మానియా యూనివర్సిటీలో ప్రధాని నరేంద్రమోదీ దిష్టిబొమ్మ దగ్దం

హైదరాబాద్ ఏప్రిల్‌ 29 (ఈతరం భారతం న్యూ స్);: రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ప్రధాని నరేంద్రమోదీ దిష్టిబొమ్మను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కళాశాల ఆవరణలో విద్యార్థి నాయకులు సోమవారం దహనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ ..ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విధానాలను అవలంబిస్తున్నాయని మండిపడ్డారు.భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నిస్తూ మోదీ, అమిత్‌షాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు వెంకట్‌ నాయక్‌, వలిగొండ నరసింహ, ఈశ్వర్‌, అజయ్‌, రఫీ తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top