EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 1 1 మంది మృతి

న్యూ ఢిల్లీ ఏప్రిల్ 30 (ఈతరం భారతం న్యూస్ ): వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 1 1 మంది మృతి చెందిన సంఘటన కేరళ, బిహార్ రాష్ట్రాలలో జరిగింది. కేరళలోని కన్నూరు ప్రాంతం పునచెర్రీ గ్రామ శివారులో కారు, లారీ ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లారీ డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు.కాగా బిహార్‌లోని భగల్‌పూర్ ప్రాంతం అమపూర్ గ్రామ శివారులో జాతీయ రహదారిపై ట్రక్కు టైర్ పేలడంతో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. వివాహ వేడుకుల నిమిత్తం కారులో ధపారి నుంచి కహల్‌గాం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు.

 

Related News

Select the Topic
Scroll to Top