EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

మన మేనిఫెస్టో అదిరిపోయిందని.. సైకో జగన్ మేనిఫెస్టో వెలవెలబోయింది ఎన్నికల మేనిఫెస్టో అంటే మనం అయిదేళ్లలో చేయబోయే పనులు  అంతేగానీ ఇంట్లో కూర్చుని బటన్ నొక్కేస్తాననడం కాదు కేసులకు భయపడొద్దు… తనది హత్యా రాజకీయాలు చేసే మనస్తత్వమా..?

ఏలూరు ఏప్రిల్ 30 (ఈతరం భారతం న్యూ స్): మన మేనిఫెస్టో అదిరిపోయిందని.. ఈ సైకో(జగన్) మేనిఫెస్టో వెలవెలబోయిందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల మేనిఫెస్టో అంటే మనం అయిదేళ్లలో చేయబోయే పనులని.. అంతేగానీ ఈ సైకో(జగన్) ఇంట్లో కూర్చుని బటన్ నొక్కేస్తానని అంటే కుదురుతుందా అని ప్రశ్నిచారు. తాను ఏం అభివృద్ధి చేయలేదని చెబుతున్నారు.. మరీ ఈ ఐదేళ్లలో జగన్ ఏం చేశారని చంద్రబాబు ప్రశ్నించారు. దెందులూరు ‘ప్రజాగళం’ భారీ బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సభలో టీడీపీ నేత వంగవీటి రాధా, ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్, దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు.

కేసులకు భయపడొద్దు…

వంగవీటి రాధాకృష్ణ సేవలు ఈ రాష్ట్రానికి చాలా అవసరమని చెప్పారు. ఆయన సేవలు భవిష్యత్తులో ఉపయోగించుకుంటామన్నారు. పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేనివాడు ఒక నాయకుడా.. పిల్లలను జగన్ గంజాయిపరం చేశారని ధ్వజమెత్తారు. కేసులకు భయపడొద్దని.. తప్పుడు కేసులు పెట్టేవారికి శిక్షలు పడతాయని హెచ్చరించారు. ఇప్పటివరకు తన మంచితనం చూశారని.. రాబోయే రోజుల్లో తన కఠినత్వాన్ని చూస్తారని హెచ్చరించారు.

తనది హత్యా రాజకీయాలు చేసే మనస్తత్వమా..?

అబద్ధాలు చెప్పడంలో జగన్ పీ‌హెచ్‌డీ చేశారన్నారు. తప్పులు చేసిన వారిని కాదని, బాధితులపైనే కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు.కొత్తగా జగన్ గ్రాబింగ్ యాక్ట్ తెస్తున్నారని.. ఆ చట్టం అమలయితే, మన ఆస్తులు అన్నీతానే కైవసం చేసుకుంటారని ఆరోపించారు.జగన్‌ను చూడగానే గొడ్ఢలి జ్ఞాపకం వస్తుందని ఎద్దేవా చేశారు. కరెంట్ ఛార్జీలు పెంచనని చెప్పి తొమ్మిది సార్లు పెంచాడన్నారు. ఆస్తిపన్ను మీద పన్ను, చెత్త మీద పన్ను.. పన్ను మీద పన్నులు వేశారని ఫైర్ అయ్యారు. తనపై చంద్రబాబు దాడి చేయడానికి ప్లాన్ చేస్తున్నారని.. జగన్, ఆయన భార్య భారతి, ఏ2 అంటున్నారని.. తనది హత్యా రాజకీయాలు చేసే మనస్తత్వమా అని చంద్రబాబు ప్రశ్నిచారు.

తనది అభివృద్ధి చేసే రాజకీయమన్నారు. ఇలాంటి వ్యక్తిని శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పించాలని మందలించారు. దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని జగన్ పక్కన పెట్టుకుని తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. సత్తా ఉంటే ప్రాజెక్టులు కట్టాలని హితవు పలికారు. తాను పోలవరం ప్రాజెక్టు పనులను ఎలా పరిగెత్తించానో అందరికీ తెలుసునని.. అలాంటి ప్రాజెక్టును జగన్ ముంచేశారని ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం, చింతలపూడి ప్రాజెక్టుల ద్వారా దెందులూరుకి నీరిచ్చే బాధ్యత తనదని తెలిపారు. తమ మేనిఫెస్టోలో ఆడపడుచులకు ప్రాధాన్యత ఇచ్చానని ఉద్ఘాటించారు. వారి సంక్షేమానికి కట్టుబడి ఉంటా.. అండగా ఉంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

సంపద సృష్టిస్తా..

ఆడబిడ్డలకు రక్షణగా ఉంటా.. వారి భద్రతకు భరోసా తనదన్నారు. ఈ సైకో మాదిరిగా పదిరూపాయలు ఇచ్చి, వంద రూపాయలు తీసుకునే మనస్తత్వం తనది కాదన్నారు. తాను సంపద సృష్టిస్తానని.. ఆదాయం పెంచుతానని.. ఆ సంపదను మీకు పంచుతానని వివరించారు. 2047నాటికి ప్రపంచంలోనే తెలుగువారు అగ్రస్థానంలో ఉండటానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జగన్ విధానం జలగ మాదిరిగా రక్తం తాగే విధానమని ఆక్షేపించారు. అక్వా రైతులకు 1.50 రూపాయలకే కరెంట్ ఇస్తానని హామీ ఇచ్చారు.

 

 

 

Related News

Select the Topic
Scroll to Top