EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

బీజేపీ, కాంగ్రెస్ పార్టీ విధానాలు అగ్రవర్ణాల ప్రయోజనాలకే అనుకూలం    బీజేపీ గెలిస్తే రిజర్వేషన్ల ఎత్తివేత అంటూ అర్థరహితంగా కాంగ్రెస్ వ్యాఖ్యలు.. రిజర్వేషన్లను ఎత్తేసేదుంటే EWS, మహిళా రిజర్వేషన్లను బీజేపీ ఎందుకు తీసుకొచ్చింది       బీసీ రాజ్యాధికార సమితి దాసు సురేశ్ -అధ్యక్షులు

హైదరాబాద్ ఏప్రిల్ 30 (ఈతరం భారతం న్యూస్);రిజర్వేషన్లు ఎత్తేసే ఉద్దేశమే బిజెపికి ఉంటే ఈడబ్ల్యూఎస్ మరియు మహిళ రిజర్వేషన్ల ను ఎందుకు ప్రవేశపెట్టేదని దక్షిణాది రాష్ట్రాల బీసీ దళిత ఆదివాసీ మేధావులతో మంగళవారం ఏర్పాటు చేసిన జూమ్ సమావేశంలో ప్రముఖులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.. సమావేశ నిర్వాహకులు , బీసీ రాజ్యాధికార సమితు అధ్యక్షులు దాసు సురేశ్ మాట్లాడుతూ 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఏర్పడిన మొదటి బీసీ కమీషను ( కాకా కాలేల్కర్ ) రిపోర్ట్ ను , 1980 లో మండల్ కమీషన్ రిపోర్ట్ ను తొక్కిపెట్టిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. పేదలకోసం కులగణన నిర్వహిస్తామంటున్న కాంగ్రెస్ పార్టీ అగ్రవర్ణాలకు అనుకూలంగా ఉన్న ఈడబ్ల్యూఎస్, మహిళా రిజర్వేషన్లను కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో ఎందుకు వ్యతిరేకించలేదని ప్రశ్నించారు..? దీనినిబట్టే ఇరు పార్టీలు అగ్రవర్ణ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయే తప్ప పేద బడుగు బలహీన వర్గాల కోసం కాదని స్పష్టం అవుతుందని తెలిపారు.. రాజకీయంగా ఇరుపార్టీలు చేసుకునే అభియోగాలతో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఒరిగేదేమీ లేదని గమనించాల్సిందిగా ప్రజలకు ఓటర్లకు విజ్ఞప్తి చేసారు .అగ్రవర్ణాల చేతుల్లో ఉన్న పార్టీలు ఆడుతున్న చదరంగంలో పేదవర్గాలను పావులుగా చేసి ఓట్లను రాబట్టాలనే కుట్ర దాగి ఉన్న విషయాన్ని గమనించాల్సిందిగా సహచర సామాజిక ఉద్యమ కార్యకర్తలకు పిలుపునిచ్చారు ..ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ , తమిళనాడు , తెలంగాణ మేధావులు , సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు

..

 

Related News

Select the Topic
Scroll to Top