హైదరాబాద్ మే 2 (ఈతరం భారతం న్యూ స్); ఓబీసీ రిజర్వేషన్లను దేశవ్యాప్తంగా ఎత్తివేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేసిందని అందులో భాగంగానే అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు కల్పించి బీసీలకు కల్పించలేదని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కల్పించకుండా, మహిళా బిల్లులో బీసీ మహిళకు సబ్ కోట కల్పించకుండా చేయడమే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు.గురువారం బీసీ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు, ప్రస్తుతం జరిగే లోక్ సభ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొంటున్న బిజెపి అగ్ర నేతలు మోదీ, అమిత్ షా, నడ్డాలు అరవై శాతం జనాభా ఉన్న ఒబీసీలకు భరోసా ఎందుకు కల్పించలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు కులగనన చేయాలని బీసీలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్న బీసీ కులగలను అంశాన్ని కనుమరుగు చేయడానికి కుట్ర చేస్తున్నారని సామాజిక రిజర్వేషన్లను పొమ్మనకుండా భాజాప ప్రభుత్వం పొగ పెడుతుందని జాజుల పైర్ అయ్యారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహ అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్ బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్ బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకూర్మ బీసీ నాయకులు వరికుప్పల మధు మహేష్ మీరు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు















