EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ప్రతి ఒక్కరు పోస్టల్ బ్యాలెట్ తో తమ ఓటుహక్కు వినియోగించుకోవాల : ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

03.05.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల, ఖమ్మం.

ఎన్నికల విధుల సిబ్బంది ప్రతి ఒక్కరు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. రిటర్నింగ్ అధికారి, శుక్రవారం ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఖమ్మం రూరల్ మండల తహసీల్దార్, ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాలను సందర్శించి, పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను పరిశీలించారు. మొత్తం పోస్టల్ బ్యాలెట్ జారీ, ఓటింగ్ అడిగి తెలుసుకున్నారు. ఫెసిలిటేషన్ కేంద్రఏర్పాట్లు, ప్రవేశం, నిష్క్రమణ, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. రాజకీయ పార్టీల ఏజెంట్లు కేంద్రంలో ఉన్నది లేనిది అడిగి తెలుసుకుని, వారికి పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ గురించి వివరించారు. రెండేసి కౌంటర్లు ఏర్పాటుచేసినట్లు, అవసరమైతే కౌంటర్లు పెంచి, త్వరితగతిన ఓటింగ్ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. సాధారణ పోలింగ్ కేంద్రంలో చేపట్టాల్సిన చర్యలను తీసుకోవాలని ఆయన తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ పత్రాలు, రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా సహాయ రిటర్నింగ్ అధికారి, ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, సహాయ రిటర్నింగ్ అధికారి, ఎస్డీసి ఎం. రాజేశ్వరి, ఖమ్మం అర్బన్ తహశీల్దార్ సిహెచ్. స్వామి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top